RAW | న్యూఢిల్లీ, మార్చి 26: భారత నిఘా సంస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)పై ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ఏర్పాటైన యూఎస్ కమిషన్ సిఫార్సు చేసింది. విదేశాల్లోని సిక్కు వేర్పాటు వాదులను హతమారుస్తున్నట్టు ‘రా’పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆం క్షలు విధించాలని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ట్రంప్ ప్రభుత్వాన్ని కోరి ంది.
మైనారిటీల పట్ల భారత్ వ్యవహరిస్తున్న తీరు అధ్వానంగా ఉన్నట్టు పేర్కొంది. అంతేకాకుండా మత స్వేచ్ఛా ఉల్లంఘనకు పాల్పడుతున్న భారత్‌ను ‘ఆందోళన కలిగించే దేశం’గా ప్రకటించాలని కమిటీ అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. ఈ నివేదికను భారత్ తీవ్రంగా ఖండించింది.