న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : భారతీయ వస్తువులపై అమెరికా విధించిన 25 శాతం జరిమానా సుంకాలను త్వరలోనే ఉపసంహరించి, 25 శాతం ప్రతీకార సుంకాలను త్వరలోనే తగ్గించవచ్చని తాను ఆశిస్తున్నట్లు భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ గురువారం తెలిపారు.
అధిక సుంకాలతో తల్లడిల్లుతున్న ఎగుమతిదారులకు అమెరికా నుంచి భారీ ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. నవంబర్ నెలాఖరుకు అమెరికా తన సుంకాలను ఉపసంహరించుకోవచ్చునని న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు.