న్యూఢిల్లీ : స్పైసీ, టేస్టీ దేశీ ఫుడ్‌ను ఇప్పుడు విదేశీయులు సైతం (Viral Video) ఇష్టంగా తింటున్నారు. షహి పనీర్, దాల్ మఖానీ, బటర్ నాన్, జిలేబి వంటి ఐకానిక్ డిష్‌లు భారత్ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చాటుతున్నాయి. భారతీయ వంటకాలను ఆస్వాదిస్తూ పలువురు విదేశీయులు తరచూ సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేస్తుంటారు.
ఇక అమెరికన్ వ్యక్తి తొలిసారిగా భారతీయ రుచులను ఆస్వాదిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో కెంటుకీలో ఇండియన్ రెస్టారెంట్ ఇండియా ఓవెన్ నుంచి మీల్స్ ఆర్డర్ చేస్తాడు. ఆనియన్ భజియా, బటర్ చికెన్, గార్లిక్ నాన్, రైస్, గులాబ్ జామున్‌ను ఆర్డర్ చేస్తాడు. తన కారులో కూర్చుని ప్రతి డిష్‌ను ఆస్వాదించడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది.
This incredibly sincere white guy trying Indian food for the very first time and having his mind blown is so wholesome pic.twitter.com/ChDld0D1I0
— Microplastics Explorer (@DiabolicalSpuds) October 15, 2023
ఆనియన్ భజియాకు 10కి 8 రేటింగ్ ఇచ్చిన వ్యక్తి గార్లిక్ నాన్ టేస్ట్‌కు 9.5 రేటింగ్ ఇచ్చాడు. బటర్ చికెన్‌కు ఏకంగా 9.9 రేటింగ్ ఇస్తూ ఎంతో టేస్టీగా ఉందని, డివైన్ అంటూ కితాబిచ్చాడు. గులాబ్ జామ్‌తో తన మీల్స్‌ను ముగించాడు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకూ 3.5 కోట్ల వ్యూస్ వచ్చాయి.
Read More :
Marri Pravalika | మా అక్క ఆత్మహత్యకు శివరామే కారణం : ప్రవళిక సోదరుడు