Marri Pravalika | మా అక్క ఆత్మహత్యకు శివరామే కారణం : ప్రవళిక సోదరుడు
Marri Pravalika | మా అక్క ఆత్మహత్యకు శివరామే కారణం అని ప్రవళిక సోదరుడు కుమార్ స్పష్టం చేశారు. మాకు న్యాయం జరగాలంటే అతన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ ఇతర పార్టీలు కూడా మా ఇంటికి రావొద్దు.. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దని కుమార్ విజ్ఞప్తి చేశారు.
Marri Pravalika | వరంగల్ : మా అక్క ఆత్మహత్యకు శివరామే కారణం అని ప్రవళిక సోదరుడు కుమార్ స్పష్టం చేశారు. మాకు న్యాయం జరగాలంటే అతన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ ఇతర పార్టీలు కూడా మా ఇంటికి రావొద్దు.. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దని కుమార్ విజ్ఞప్తి చేశారు.
అక్క హాస్టల్‌కు నేను కొంచెం దూరంలోనే ఉంటాను. ఐదు నిమిషాల్లోనే అక్క హాస్టల్‌కు చేరుకుంటాను. వారానికి మూడు నాలుగు సార్లు కలిసి మాట్లాడుకుంటాం. ముఖ్యంగా అక్క ప్రవళిక చనిపోవడానికి కారణం శివరామ్ అనే వ్యక్తి. వేరే అమ్మాయి వల్ల పరిచయం అయ్యాడు. అప్పటి నుండి అక్కకి ఇష్టం లేకపోయినా తనతో మాట్లాడడం, కాల్ చెయ్యడం, హాస్టల్‌కు వచ్చి అందరి ముందు మాట్లాడమని ఇబ్బంది పెట్టడం వల్ల, అక్కకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆఖరికి అమ్మకు, నాన్నకు , నాకు.. ఎవరికి చెప్పిన ఏమంటారో, ఏం సమస్య వస్తుందో ఇంట్లో అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది. ముఖ్యంగా అక్క చనిపోవడానికి కారణం హాస్టల్ దగ్గర చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏడిపించడం, కాల్ చెయ్యడం, ఫ్రెండ్స్ ఫోన్ నుండి ఇలా వేరే వేరే నెంబర్స్ నుండి కాల్ చెయ్యడం వల్ల ఎవరికి చెప్పుకోవాలో తెలియక సూసైడ్ చేసుకుంది. అక్కకి ఇప్పుడు న్యాయం జరగాలంటే శివరామ్‌ని ఎక్కడ ఉన్న పట్టుకుని తన అక్క చనిపోయిన్నట్టుగా ఉరి గానీ, ఎన్కౌంటర్ గానీ చేసి ప్రభుత్వం మాకు న్యాయం చెయ్యాలి. ప్రభుత్వం, కేసీఆర్ చేశారని చెప్తున్నారు కానీ వారు చేయలేదు. మాకు న్యాయం జరగాలంటే వాడిని శిక్షించాలని కుమార్ డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

