అదానీపై కేసు ఉపసంహరణకు కోర్టు తిరస్కరణ
కోట్ల డాలర్ల లంచం కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, ఇతరులపై క్రిమినల్ అభియోగాలను తక్షణమే ఉపసంహరించుకోవడానికి న్యాయ శాఖ(డీవోజే)కు అనుమతి ఇవ్వడానికి అమెరికా ఫెడరల్ కోర్టు నిరాకరించింది.
- న్యాయ శాఖ ఇచ్చిన వివరణ నిస్సారంగా, సంక్షిప్తంగా ఉంది
- జూలై 13లోగా వివరణ ఇవ్వాలి
- సౌర విద్యుత్తు ప్రాజెక్ట్ లంచం కేసు అభియోగాలపై యూఎస్ కోర్టు
న్యూఢిల్లీ, జూన్ 27: 25 కోట్ల డాలర్ల లంచం కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, ఇతరులపై క్రిమినల్ అభియోగాలను తక్షణమే ఉపసంహరించుకోవడానికి న్యాయ శాఖ(డీవోజే)కు అనుమతి ఇవ్వడానికి అమెరికా ఫెడరల్ కోర్టు నిరాకరించింది. అలా చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన వివరణ సంక్షిప్తంగా, నిస్సారంగా, నిర్ధారణాత్మకంగా ఉందని కోర్టు తేల్చింది. 8 మంది నిందితులపై ఉన్న అభియోగాన్ని కొట్టి వేయాలని కోరడానికి గల కారణాలను తెలియచేయాలని న్యూయార్క్ తూర్పు డిస్ట్ట్రిక్ట్ కోర్టు జడ్జి నికోలస్ జీ గరౌఫిస్ న్యాయ శాఖను ఆదేశించారు.
అభియోగ పత్రాన్ని శాశ్వతంగా కొట్టివేయాలని కోరడానికి గల ప్రతి కారణాన్ని, అలాగే ఆయా కారణాలకు తగిన వాస్తవ ఆధారాలను ప్రభుత్వం సమర్పించాలని న్యాయస్థానం పేర్కొంది. ఈ సంవత్సరం జూలై 13 లోగా తన వివరణను దాఖలు చేయాలని న్యాయశాఖను న్యాయమూర్తి ఆదేశించారు. 18(ఏ) నిబంధన కింద గౌతమ్ అదానీ అమెరికా ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిన తర్వాత ఈ ఉత్తర్వు వెలువడింది.
కేసు ఏమిటి?
12 గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ అభియోగ పత్రం దాఖలైంది. దాని ప్రకారం ఆ ప్రాజెక్టు, దానికి సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఆర్థికంగా ఆచరణ సాధ్యం కావాలంటే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ సరఫరా ఒప్పందాలను కుదుర్చుకోవడం అవసరంగా ఉండేది. ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు భారత్‌లోని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చేలా గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, ఇతరులు ఒక ప్రణాళికను రూపొందించారని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులకు మాత్రం రూ.2,029 కోట్ల లంచాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

