భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో మరోసారి దళితుడిపై దాడి జరిగింది. ఈసారి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగి అయిన దళితుడిని కొట్టి, ఆయనపై మూత్రం పోసిన ఘటన చోటుచేసుకున్నది. భోపాల్‌లో జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాంస్వరూప్ అహివార్ కొత్వాల్‌గా పనిచేస్తున్నారు. అయితే కొంతమంది ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని, వెళ్లి పరిశీలించాలని పట్వారీ సూచించడంతో రాంస్వరూప్ వెళ్లారు. ఆక్రమణలను గుర్తించిన రాంస్వరూప్ కంచె నిర్మాణాన్ని ఆపాలని వారిని కోరగా.. ఆయనపై మూత్రం పోశారు.