న్యూఢిల్లీ, మార్చి 22 : హొర్ముజ్ జలసంధి నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవటం.. భారత్లోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని యూరి యా తయారీ ప్లాంట్లపైనా దీని ప్రభా వం పడింది. ఎరువుల కర్మాగారంలో ఇంధనంగా వాడే ఎల్ఎన్జీ సరఫరా సరిపడా లేక.. యూరియా ప్లాంట్ల సామర్థ్యం సగానికిపైగా పడిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
ఎరువుల కర్మాగారాలు సగం సామర్థ్యంతో నడుస్తున్నాయని తెలిపాయి. యుద్ధ సంక్షోభం, హొర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు ఆగిపోవటమే దీనికి కారణమని, సహజవాయువు సరఫరాదారులు బాధ్యతలు నెరవేర్చలేమని చేతులెత్తేశారని తెలిసింది. దీంతో గెయిల్-ఇండియా, ఐవోసీ, బీపీసీఎల్ నుంచి గ్యాస్ సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది.సుమారుగా 65 శాతం గ్యాస్ సరఫరా ఆగిపోయినట్టు ఇండస్ట్రీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.