న్యూఢిల్లీ, జూన్ 2: సివిల్స్ టాపర్ శృతి శర్మ మొత్తం 2,025 మార్కులకు గాను 1,105 మార్కులు(54.56%) సాధించినట్టు యూపీఎస్సీ వెల్లడించింది. రెండో ర్యాంకు సాధించిన అంకితా అగర్వాల్‌కు 1,050(51.85%) మార్కులు వచ్చినట్టు తెలిపింది. 2,025లో రాత పరీక్షకు 1,750 మార్కులు. ఇంటర్వ్యూకు 275 మార్కులు. శృతి శర్మకు రాత పరీక్షలో 932, ఇంటర్వ్యూలో 173 మార్కులు వచ్చాయి. సివిల్స్ ఫలితాలు సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ 685 మందిని ఎంపిక చేసింది. ఇందులో 508 మంది పురుషులు. 177 మంది స్త్రీలు.