న్యూఢిల్లీ : చరిత్రలో తొలిసారిగా ఎన్డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ)లో ప్రవేశాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు యూపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తదితర వివరాల కోసం https://upsconline.nic.in/ వెబ్సైట్ను సందర్శించొచ్చు.
ఎన్డీఏ, నావల్ అకాడమీ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంటుంది. దీనికి 15-18 ఏండ్ల వయసుతో పాటు ఇతర అర్హతలు ఉన్న అవివాహితులైన పురుష అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తున్నారు. పరీక్షలో అర్హత సాధించి, శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత వారిని పర్మినెంట్ కమిషన్ అధికారిగా సర్వీసులోకి తీసుకుంటున్నారు. మహిళా అభ్యర్థులకు తగిన అర్హతలు ఉన్నా ఈ అవకాశం కల్పించడం లేదు. పిటిషన్పై విచారణ సందర్భంగా మహిళలకు ప్రవేశం కల్పించాలని సాయుధ దళాలు నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.
For the first time ever, UPSC invites applications from women candidates for the entrance examination for the National Defence Academy/Naval Academy exam. The application notice was issued today and the last date for applying is October 8th. pic.twitter.com/aHRFxzQDdK
— ANI (@ANI) September 24, 2021