UPSC | నీట్, పూజా ఖేద్కర్ వివాదాలు.. పరీక్షల ప్రక్రియలో మార్పులు చేయనున్న యూపీఎస్సీ!
నీట్-యూజీ పరీక్షలో అక్రమాల ఆరోపణలు, ఐఏఎస్‌గా పూజా ఖేద్కర్ నియామకంపై వివాదం నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షల ప్రక్రియలో మార్పులకు సిద్ధమైంది. అధునాతన సాంకేతికతను వినియోగించి అక్రమాలకు తావులేకుండా చూడాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆధార్ ఆధారంగా వేలిముద్రల ధ్రువీకరణ, ముఖాన్ని గుర్తించే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనుంది.
- అక్రమాల అడ్డుకట్టకు సాంకేతికత
- ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్, ఫేషియల్ రికగ్నిషన్ వినియోగం
- నీట్, పూజా ఖేద్కర్ వివాదాల నేపథ్యంలో యూపీఎస్సీ నిర్ణయం
UPSC | న్యూఢిల్లీ, జూలై 25: నీట్-యూజీ పరీక్షలో అక్రమాల ఆరోపణలు, ఐఏఎస్‌గా పూజా ఖేద్కర్ నియామకంపై వివాదం నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షల ప్రక్రియలో మార్పులకు సిద్ధమైంది. అధునాతన సాంకేతికతను వినియోగించి అక్రమాలకు తావులేకుండా చూడాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆధార్ ఆధారంగా వేలిముద్రల ధ్రువీకరణ, ముఖాన్ని గుర్తించే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సాంకేతికను పొందేందుకు గానూ ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూ) నుంచి టెండర్లను ఆహ్వానించింది. అభ్యర్థుల బయోమెట్రిక్‌ను ధ్రువీకరించేందుకు, పరీక్ష సమయంలో అభ్యర్థుల కార్యకలాపాలను పర్యవేక్షించడం ద్వారా మోసాలు, ఒకరికి బదులుగా మరొకరు పరీక్షకు హాజరుకావడం వంటి అక్రమాలను అడ్డుకునేందుకు అధునాతన సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించినట్టు టెండర్ డాక్యుమెంట్లో యూపీఎస్సీ పేర్కొన్నది.
వారం ముందు అభ్యర్థుల వివరాలు
ఈ సాంకేతికతను అందించే ప్రభుత్వ రంగ సంస్థకు పరీక్ష తేదీకి రెండు మూడు వారాల ముందు ఏర్పాట్లు చేసుకునేందుకు పరీక్షా కేంద్రాల వివరాలు, హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య వంటి ప్రాథమిక వివరాలు అందిస్తామని యూపీఎస్సీ తెలిపింది. వేలిముద్రతో ధ్రువీకరణ, ఫేషియల్ రికగ్నిషన్ కోసం అభ్యర్థుల పేర్లు, హాల్ టికెట్ నెంబరు, ఫొటో వంటి వివరాలను మాత్రం వారం రోజుల ముందు ఇస్తామని తెలిపింది. సివిల్ సర్వీసుల పరీక్షలతో పాటు ప్రతియేటా 14 రకాల పరీక్షలను యూపీఎస్సీ నిర్వహిస్తున్నది. ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ అక్రమంగా ఉద్యోగం పొందిందనే అంశం బయటకు రావడం, ఐదేళ్ల పదవీకాలం ఉండగానే యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా వంటి అంశాలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే.
నీట్ రివైజ్డ్ ఫలితాలు విడుదల కాలేదు
- కేంద్ర విద్యా శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూలై 25: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నీట్ యూజీ-2024 రివైజ్డ్ ఫలితాలను విడుదల చేసిందని వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం గురువారం ఖండించింది. సవరణ పలితాలను ఇంకా విడుదల చేయలేదని స్పష్టం చేసింది. షేర్ అవుతున్న లింక్ పాతదని, త్వరలో అభ్యర్థుల తుది మార్కులను విడుదల చేస్తామని కేంద్ర విద్యా శాఖ తెలిపింది. నీట్ యూజీ పరీక్షలో ఫిజిక్స్‌లో అడిగిన ఓ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయన్న అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఢిల్లీ ఐఐటీ నిపుణుల బృందం సంబంధిత ప్రశ్నకు ‘ఆప్షన్ 4’ సరైన సమాధానం అని తేల్చింది. దీంతో సవరించిన ఫలితాలను విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఎన్టీఏకు ఆదేశాలు జారీచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

