న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అఖిల భారత సర్వీసుల్లో (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్) పోస్టుల భర్తీ కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2022 పరీక్షను జూన్ 5న నిర్వహించనున్నట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం ప్రకటించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 861 పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీలు ఇచ్చే తుది ప్రతిపాదనలతో పోస్టుల సంఖ్యలో మార్పులు రావొచ్చని వివరించింది.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, సాయంత్రం 6 గంటలు
దరఖాస్తును ఉపసంహరించుకొనే గడువు: మార్చి 1-మార్చి 7 సాయంత్రం 6 గంటలు
దరఖాస్తు చేసుకొనే వెబ్సైట్ లింక్: www.upsconline.nic.in