న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వోద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) కింద లభించే ప్రయోజనాలకు సంబంధించిన నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. ఎన్పీఎస్ కింద యూపీఎస్‌ను ఎంపిక చేసుకున్నవారికి ఈ నిబంధనలు వర్తిస్తాయి.
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద యూపీఎస్ అమలు) రూల్స్, 2025 పరిధిలోకి యూపీఎస్ కింద ఎన్రోల్మెంట్, పదవీ విరమణ తేదీకి ఒక ఏడాది ముందు యూపీఎస్ నుంచి ఎన్పీఎస్కు లేదా వీఆర్ఎస్కు 3 నెలల ముందు యూపీఎస్‌కు మారే సదుపాయం వస్తుం ది. ఎన్పీఎస్ కింద నమోదైన కేంద్ర ప్రభుత్వోద్యోగులు యూపీఎస్‌లో చేరడానికి వన్ టైమ్ ఆప్షన్ ఉంది.