న్యూఢిల్లీ: యూపీఐ పేమంట్స్(UPI Payments) అత్యంత వేగంగా జరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ప్రకారం నేటి నుంచి ఈ మార్పు కనిపించింది. యూపీఐ కంపెనీలు, బ్యాంకులు, పేమెంట్స్ యాప్స్ అన్నీ.. ఆర్థిక లావాదేవీల విషయంలో తమ సమయాన్ని తగ్గించుకోవాలని ఎన్పీసీఐ చేసిన సూచన మేరకు .. యూపీఐ పేమెంట్స్ స్పీడ్‌ను పెంచేశారు. కొత్త రూల్స్ ప్రకారం కేవలం 15 సెకన్లలో యూపీఐ పేమెంట్స్ పూర్తి అవుతున్నాయి. డబ్బులు పంపినా లేక రిసీవ్ చేసుకున్నా.. ఆ ట్రాన్జాక్షన్ మొత్తం 15 సెకన్లలో పూర్తి కావాల్సి ఉంటుంది. గతంలో ఆ పరిమితి 30 సెకన్లుగా ఉండేది.
తగ్గించిన సమయం అన్ని యూపీఐ ప్లాట్‌ఫామ్‌లకు వర్తించనున్నది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఎస్బీఐ యోగో, ఐమొబైల్ పేతో పాటు ఇతర యాప్‌లకు కూడా వర్తించనున్నది. కేవలం పేమెంట్స్ మాత్రమే కాదు.. ట్రాన్జాక్షన్ స్టేటస్ లేదా ఫెయిల్డ్ పేమెంట్ రివర్సింగ్ ఇప్పుడు కేవలం 10 సెకన్లలో పూర్తి కానున్నది. గతంలో ఇది 30 సెకన్లు ఉండేది. ఒకవేళ ట్రాన్జాక్షన్ తప్పు జరిగితే, దాని అప్డేట్ గురించి ఎక్కువ సేపు ఎదురుచూడాల్సిన అవసరం లేదు.