ఆ పిటిషన్లపై అక్టోబర్ 12న వాదనలు విననున్న సుప్రీంకోర్టు
Notes ban: నోట్ల రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు అక్టోబర్ 16న వాదనలు విననున్నది.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు అక్టోబర్ 16న వాదనలు విననున్నది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పిటిషన్లపై విచారణ జరుపనున్నది. ముందుగా తెలిసిన సమాచారం ప్రకారం ఇవాళే (సెప్టెంబర్ 28న) నోట్స్ బ్యాన్ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం వాదనలు వినాల్సి ఉంది. కానీ, కొన్ని న్యాయపరమైన కారణాలవల్ల విచారణ తేదీ అక్టోబర్ 12కు మారింది.
ప్రధాని నరేంద్రమోదీ 2016 సెప్టెంబర్ 8న పాత రూ.500, 1000 నోట్లను రద్దు చేశారు. రూ.500 నోటుకు బదులుగా కొత్త నోటును తీసుకురాగా, పాత రూ.1000 నోటును పూర్తిగా రద్దుచేశారు. దాని స్థానంలో రూ.2000 నోటును తీసుకొచ్చారు. అయితే ఈ నోట్ల రద్దు కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగదు కోసం నిత్యం బ్యాంకుల ముందు బారులు తీరాల్సి వచ్చింది. ఇంత జరిగినా ఆ నోట్ల బ్యాన్ వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు.
అందుకే నోట్ల రద్దుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ తీరుపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. ఈ క్రమంలోనే నోట్ల రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. తదుపరి దర్యాప్తును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీచేస్తున్నట్లు 2016, డిసెంబర్ 16న ప్రకటించింది. కానీ, ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటికీ ఏర్పాటు కాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

