Uttar Pradesh | లక్నో: యూపీలోని బరేలిలో తనను అపహరించి, సామూహిక లైంగిక దాడి చేయడమే కాక, తనను తుపాకీతో కాల్చారంటూ 10 రోజుల క్రితం ఒక మహిళ చేసిన ఫిర్యాదు పూర్తిగా అబద్ధమని పోలీసులు తేల్చారు. ఒక రాజకీయ నాయకుడు, అతని కుమారుడిని కేసులో ఇరికించడానికే ఆమె ఈ ఆరోపణలు చేయడమే కాక, ఒక తుపాకి బుల్లెట్‌ను ఆపరేషన్ ద్వారా శరీరంలో ఇంప్లాంట్ చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. మార్చి 10న తనను కొందరు అపహరించి, గ్యాంగ్ రేప్ చేయడమే కాక, తుపాకీతో కాల్చారని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల విచారణలో..తాను చెప్పినదంతా కట్టుకథేనని ఆమె ఒప్పుకుంది.