Minister’s Convoy Blocked with Cattle | మంత్రి కాన్వాయ్‌ను పశువులతో అడ్డుకున్న గ్రామస్తులు.. 90 మందిపై కేసు
Minister's Convoy Blocked with Cattle | తమ సమస్యను చెప్పుకునేందుకు మంత్రి కాన్వాయ్‌ను పశువులతో గ్రామస్తులు అడ్డుకున్నారు. (Minister's Convoy Blocked with Cattle) ఈ నేపథ్యంలో సుమారు 90 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
లక్నో: తమ సమస్యను చెప్పుకునేందుకు మంత్రి కాన్వాయ్‌ను పశువులతో గ్రామస్తులు అడ్డుకున్నారు. (Minister’s Convoy Blocked with Cattle) ఈ నేపథ్యంలో సుమారు 90 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ధరంపాల్ సింగ్ గురువారం తన నియోజకవర్గమైన అవోన్లాలోని గుర్గావ్ ప్రాంతంలో సుమారు రూ.9 కోట్లతో నిర్మించనున్న పశు వైద్యశాల భూమిపూజ కోసం వెళ్లారు.
కాగా, గ్రామంలోని వీధుల్లో సంచరించే పశువుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. రోడ్డుపై పశువులను ఉంచి మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో తగిన స్థలాన్ని గుర్తించి గోశాల ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అయితే, మంత్రి ధరంపాల్ సింగ్ కాన్వాయ్‌ను గ్రామస్తులు పశువులతో అడ్డుకోవడంపై పశు వైద్యాధికారి సంజయ్ కుమార్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని 90 మందిపై ఆదివారం కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ మంత్రిపై మండిపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

