Ram Temple | అయోధ్య రామ మందిరం వద్ద భద్రతా సిబ్బంది కాల్పుల్లో మృతి
Ram Temple | అయోధ్య రామ మందిరం వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది తుపాకీ కాల్పుల్లో మరణించాడు. అతడిపై ఎవరైనా కాల్పులు జరిపారా? ప్రమాదవశాత్తు గన్ పేలిందా? లేదా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అన్నది స్పష్టం కాలేదు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం (Ram Temple) వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది తుపాకీ కాల్పుల్లో మరణించాడు. అతడిపై ఎవరైనా కాల్పులు జరిపారా? ప్రమాదవశాత్తు గన్ పేలిందా? లేదా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అన్నది స్పష్టం కాలేదు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. యూపీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్)కు చెందిన 25 ఏళ్ల శత్రుఘ్న విశ్వకర్మ నూతన రామాలయానికి 150 మీటర్ల దూరంలోని కోటేశ్వరాలయం వీఐపీ గేట్ వద్ద సెక్యూరిటీ విధుల్లో ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో తుపాకీ కాల్పుల వల్ల అతడు మరణించినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. మృతుడి నుదుటిపై తుపాకీ గాయం ఉందని చెప్పారు.
కాగా, ఆ గేటు వద్ద శత్రుఘ్న విశ్వకర్మతోపాటు మరో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఉన్నారు. కాల్పుల శబ్దం విన్న వారిద్దరూ అక్కడకు వచ్చి చూడగా శత్రుఘ్న కుప్పకూలినట్లు గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారని పోలీస్ అధికారి తెలిపారు. ప్రమాదవశాత్తు గన్ పేలడంతో విశ్వకర్మ మరణించాడా? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? అన్నది స్పష్టంగా తెలియలేదని అన్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

