Suicide | భోపాల్ : ఓ భక్తుడు ఆలయంలో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భక్తుడిని చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మెహర్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన లల్లారామ్(37) మెహర్ జిల్లాలోని శారద మాతా ఆలయానికి సోమవారం రాత్రి చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో లల్లారామ్ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భక్తుడిని గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న మెహర్ పోలీసులు.. డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. భక్తుడికి సమీపంలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. భక్తుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో ఈ ఆలయంలో కొంత మంది భక్తులు తమ నాలుకలను కోసుకునేందుకు యత్నించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇక ఈ ఆలయానికి ప్రతి రోజు కొన్ని వందల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారని తెలిపారు.