లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 36 ఏళ్ల వ్యక్తి తన భార్యను పోలీసు స్టేషన్లోనే కాల్చి(UP Murder) చంపాడు. ఈ ఘటన రాంపూర్ అతారియాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తన భార్య లవర్‌తో కలిసి వెళ్లిపోయినట్లు కొన్ని రోజుల క్రితమే భర్త పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. నిందిత వ్యక్తిని అనూప్‌గా గుర్తించారు. భార్యను పోలీసు స్టేషన్లో చంపిన అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. హర్దోయి ఎస్పీ అశోక్ కుమార్ మీనా మాట్లాడుతూ ఈ కేసులో దర్యాప్తు అధికారితో పాటు మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. డ్యూటీలో నిర్లక్ష్యం కింద ఆ ఇద్దర్నీ సస్పెండ్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. అనూప్ భార్య సోని వయసు 35 ఏళ్లు. ఆమె స్వస్థలం రామాపుర్ అతారియా. అయిదు రోజుల క్రితం లవర్‌తో కలిసి ఆమె పరారీ అయ్యింది. ఈ నేపథ్యంలో అనూప్ ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. జ్వలరీ, 35వేల నగదు తీసుకెళ్లినట్లు తన ఫిర్యాదులోఆరోపించాడు. ఆదివారం అనూప్ భార్యను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం కోర్టులో ఆమెను ప్రవేశపెట్టాల్సి ఉంది.
పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న క్యాంటీన్‌కు సోనీని ఓ మహిళా కానిస్టేబుల్ తీసుకెళ్లింది. అక్కడ వేచి ఉన్న భర్త అనూప్ .. సోనిపై దాడి చేసి కాల్చేశాడు. కిందపడిపోయిన సోనీ తీవ్రంగా రక్తాన్ని కోల్పోయింది. తుపాకీ శబ్ధానికి పోలీసులు ఆందోళనపడ్డారు. వేగంగా అక్కడికి పరుగెత్తుకు వచ్చారు. తప్పించుకోబోతున్న అనూప్‌తో పాటు మరో వ్యక్తిని పట్టుకున్నారు. హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ సోనీని ఆస్పత్రి తీసుకెళ్లారు. కానీ ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
పోలీసు స్టేషన్ పరిధిలోనే సెక్యూర్టీ లోపం ఎలా జరిగిందన్న కోణంలోనూ ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నారు.