సుల్తాన్పూర్: రెండు దశాబ్దాల నాటి ఓ కేసులో విచారణకు హాజరుకాకపోవడంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌పై యూపీలోని సుల్తాన్పూర్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను అరెస్టు చేసి, ఈ నెల 28న తమ ముందు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది.
మంగళవారం కోర్టుకు రావాలని ఆదేశిస్తూ సంజయ్ సింగ్‌తోపాటు ఎస్పీ నేత అనూప్ సందాపై కోర్టు ఈ నెల 13న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. అయితే నిందితులు కోర్టుకు హాజరు కాలేదు. విద్యుత్తు సరఫరా సమస్యపై మాజీ ఎమ్మెల్యే అనూప్ సందా నేతృత్వంలో రోడ్డును దిగ్బంధించి నిర్వహించిన ఆందోళనకు సంబంధించి 2001, జూన్‌లో ఓ కేసు నమోదైంది. ఇందులో సంజయ్ సింగ్ పాల్గొన్నారు.