బులంద్‌షహర్ : యూపీలోని బులంద్‌షహర్‌లో చిన్న కిరాణా కొట్టు యజమానికి ఆదాయ పన్ను శాఖ నుంచి రూ.141 కోట్ల అమ్మకాలకు సంబంధించి నోటీస్ వచ్చింది. అయితే తన పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేసి ఢిల్లీలో ఆరు సంస్థలను ఏర్పాటు చేశారని.. దాని వల్లే తనకు నోటీసులు వస్తున్నాయని బాధితుడు సుధీర్ వాపోయాడు.
2022లో తనకు మొదటిసారి నోటీస్ అందిందని.. అప్పుడే తాను ఐటీ శాఖ అధికారులకు సదరు కంపెనీలతో తనకెలాంటి సంబంధం లేదన్న విషయాన్ని వివరించానన్నారు. తాను రూ.141 కోట్ల అమ్మకాలు చేసినట్టు ఈ సంవత్సరం జూలై 10న వచ్చిన నోటీస్‌ను చూసి తాను దిగ్భ్రాంతి చెందానని తెలిపారు.