సంభల్(యూపీ), డిసెంబర్ 21: ఉత్తర్ ప్రదేశ్లోని సంభల్ జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కల్కి విష్ణు ఆలయాన్ని సర్వే చేసిన మరుసటి రోజే భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న పురాతన బావిని శనివారం తనిఖీ చేసింది.
ఆలయ ప్రాంగణం లో కృష్ణ కూపం(బావి) ఉందని ఆల య పూజారి మహేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు. బావి చాలా పురాతనమైనదని అది ఎప్పటిదో నిర్ధారించాల్సి ఉందని సంభల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ వందనా మిశ్రా చెప్పారు.