Tariq Anwar : కుండపోత వర్షాల (Heavy rains) తో బీహార్ రాష్ట్రం (Bihar state) లోని కతిహార్ జిల్లా (Katihar district) అతలాకుతలమైంది. ఎడతెగని వర్షాలవల్ల అక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ (Congress MP) తారీఖ్ అన్వర్ (Tariq Anwar) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం వివాదాస్పదమైంది. ఎంపీ వరద నీటిలో దిగకపోవడంతో గ్రామస్థులు వీపులపై మోసుకెళ్లారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే ఆ విమర్శలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. ఎంపీకి అస్వస్థతగా ఉండటంతో గ్రామస్థులు మోసుకెళ్లారని వ్యాఖ్యానించింది. కాగా తారీఖ్ అన్వర్ కతిహార్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. వరదలు రావడంతో పరిస్థితిని పరిశీలించేందుకు రెండ్రోజులపాటు ఆయన తన నియోజకవర్గంలో పర్యటించారు. అందుకోసం పలు రకాల రవాణా సౌకర్యాలను వినియోగించారు. ట్రాక్టర్, పడవలో వెళ్లి వరద బాధితులను కలిశారు.
ఈ సందర్భంగా ఓ చోట బురదగా ఉండటంతో గ్రామస్థులు ఆయనను వీపులపై మోసుకెళ్లారు. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. ఈ వీడియోపై కతిహార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ యాదవ్ స్పందించారు. ఎంపీ అన్వర్‌కు ఆరోగ్యం బాగా లేదు కాబట్టే గ్రామస్థులు మోసుకెళ్లారని చెప్పారు. తాము ట్రాక్టర్, బోటు, బైకులపై గ్రామాల్లో పర్యటించామని తెలిపారు.
ఒకచోట బురద కారణంగా తాము ప్రయాణిస్తున్న ట్రక్ నిలిచిపోయిందని, అక్కడి నుంచి ఇంకా 2 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉందని, ఆ సమయంలో ఎండ బాగా ఉండటంతో అన్వర్ అస్వస్థతకు గురయ్యారని సునీల్ యాదవ్ చెప్పారు. ఎంపీ తల తిరుగుతోందని చెప్పడంతో గ్రామస్థులు స్వచ్ఛందంగా, ప్రేమతో ఆయనను ఎత్తుకుని తీసుకెళ్లారని తెలిపారు.
कटिहार के सांसद “तारिक अनवर” ! थोड़ा भी शर्म – लिहाज बाक़ी रहता, तो राजनीति छोड़ दिए होते ??
pic.twitter.com/CdTHMUezX4— Abhishek Singh (@Abhishek_LJP) September 8, 2025
వైరల్ అయిన వీడియోలో గ్రామస్థులు తమ వీపుపై ఎంపీని మోసుకెళ్తూ కనిపించారు. ఒక పోలీస్ కూడా వారికి సాయం చేశారు. పర్యటన అనంతరం అన్వర్ తన ఎక్స్ ఖాతాలో కొన్ని ఫొటోలు, వీడియోలు పంచుకున్నారు. వరద బాధితులకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టి వారిని ఆదుకోవాలని కోరారు.