Fadnavis : మహారాష్ట్ర (Maharastra) లో ఓట్ల దొంగతనాని (Vote theft) కి పాల్పడటం ద్వారా మహాయుతి సర్కారు (Mahayuti govt) ఏర్పాటైందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) స్పందించారు. ముఖ్యంగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే (Raj Thackeray) తాజాగా రాహుల్‌గాంధీ ఆరోపణలకు మద్దతు పలుకడంతో ఫడ్నవీస్ ఆగ్రహించారు. ప్రతిపక్షాలు ప్రజలను కించపర్చడం మానుకునే వరకు వాళ్లు ఎన్నికల్లో గెలువలేరని వ్యాఖ్యానించారు.
ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు ఓటర్లను అవమానిస్తున్నాయని ఫడ్నవీస్ అన్నారు. ప్రజలను కించపర్చడంవల్లనే వాళ్లు ఎన్నికల్లో ఓడిపోతున్నారని చెప్పారు. వాళ్ల ఓటమిపై వాళ్లు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఆత్మపరిశీలన చేసుకునే వరకు వాళ్లు ఎన్నికల్లో గెలువరని అన్నారు.
అదేవిధంగా ప్రజలను కించపర్చడం కూడా మానుకోవాలని, ప్రజలను కించపర్చడం మానకపోయినా వాళ్లు ఎన్నికల్లో గెలువలేరని ఫడ్నవీస్ చెప్పారు. మహారాష్ట్రలో ఓట్ల చోరీ జరిగిందని గత కొన్ని రోజులుగా రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణలకు మహారాష్ట్రలో శరద్‌పవార్ ఎన్సీపీ, రాజ్‌థాకరే మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన, ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీలు మద్దతు పలికాయి.