న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో గొడవకు దిగాడు. ఇద్దరిపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించి, అతడిని పోలీసులకు అప్పగించారు. అటు.. ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో బయలుదేరే ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
సోమవారం ఉదయం ఈ విమానం బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో సిబ్బంది అప్రమత్తమై విమానాన్ని నిలిపివేసి, ప్రయాణికులను దించేసి వేరే విమానంలో పంపారు.