న్యూఢిల్లీ: ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ బహిష్కృత నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగర్‌కు ప్రత్యేక కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను ఢిల్లీ హైకోర్టు మంగళవారం సస్పెండ్ చేసింది. యావజ్జీవ కారాగార శిక్షను సస్పెండ్ చేస్తున్నట్లు జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్, జస్టిస్ హరీశ్ వైద్యనాథన్ శంకర్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
దోషిగా నిర్ధారణ అయితే శిక్షా కాలంలోని మిగిలిన భాగాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలోని మఖీ గ్రామంలో 2017 జూన్‌లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి పోలీసు అధికారులతో కుమ్మక్కై బాధితురాలి తండ్రిని హత్య చేసినందుకు సెంగర్‌కు తీస్ హజారీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.