న్యూఢిల్లీ : అవివాహిత లేదా వితంతు కుమార్తెకే చనిపోయిన తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుందని, పైండ్లె, విడాకులు తీసుకొన్న కుమార్తెకు ఉండదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ చట్టం(హెచ్ఏఎంఏ)లోని సెక్షన్ 21 ప్రకారం భరణం పొందేందుకు ఆధారపడిన తొమ్మిది మంది క్యాటగిరీల బంధువుల్లో విడాకులు తీసుకొన్న కుమార్తె లేదని పేర్కొన్నది.
ఈ మేరకు తల్లి, సోదరుడు తనకు భరణం ఇవ్వడం లేదంటూ భర్త నుంచి విడాకులు తీసుకొన్న ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.