న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) సోమవారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహించింది. పలువురు ఎంపీలు, ముస్లిం సంస్థలు ఈ నిరసనలో పాల్గొన్నాయి. ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ మాట్లాడుతూ, ఎన్డీయేలోని టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ (రామ్‌విలాస్) పార్టీలను హెచ్చరించారు. మందిరం-మసీదు పేరుతో నిరంతరం ప్రజలు పోట్లాడుకోవాలనేది మోదీ ఉద్దేశమని మండిపడ్డారు.