న్యూఢిల్లీ: డీజిల్‌తో ఐసోబ్యూటనాల్‌ను కలపడం ఈ సంవత్సరంలో వీలైనంత త్వరలో అమలు చేస్తామని కేంద్ర రోడ్డు, రవాణా, హైవేల శాఖ కార్యదర్శి ఉమాశంకర్ శుక్రవారం తెలిపారు. దేశంలో ఇంధన భద్రతను మెరుగు పరచడానికి, రోడ్లు, హైవేలను కర్బన రహితంగా మార్చడానికి ఈ చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
‘సీఐఐ బహుళ విధ రవాణా, లాజిస్టిక్స్ సదస్సు’లో ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ హెవీ డ్యూటీ వాణిజ్య వాహనాల కోసం బ్యాటరీ మార్పిడి, బ్యాటరీ చార్జింగ్ అవసరమయ్యే వ్యవస్థను నిర్మించడానికి, ట్రక్-టైలర్ల మార్పిడిపై రహదారుల శాఖ త్వరలో ఒక ముసాయిదా నోటిఫికేషన్ తీసుకురావొచ్చని తెలిపారు.