న్యూఢిల్లీ: పెట్రో ధరల తగ్గుదలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉండి, రానున్న త్రైమాసికంలో ఆయిల్ కంపెనీలకు లాభాలొస్తే ధరలు తగ్గే అవకాశం ఉండొచ్చన్నారు.
గత త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల తీరు పర్వాలేదన్నారు. ‘వాళ్లు కొన్ని నష్టాలను భర్తీ చేసుకోగలిగారు. వాళ్లు మంచి కార్పొరేట్ పౌరులు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం’ అని పెట్రో ధరల తగ్గింపును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.