పెత్తనమంతా పీఎంవోదే!
ప్రధాని నరేంద్రమోదీ తన పదవి పట్ల అభద్రతతో ఉన్నారా? క్యాబినెట్ సహచరులను కూడా నమ్మడంలేదా? అందుకే కేంద్రమంత్రులు మీడియా సమావేశాన్ని నిర్వహించాలంటే కూడా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి అనుమతి
కేంద్రమంత్రులు ప్రెస్‌మీట్ పెట్టాలన్నా పీఎంవో అనుమతి తీసుకోవాల్సిందే
‘360 డిగ్రీల ఎవాల్యుయేషన్’ సరిగాలేదు
ప్రభుత్వానికి అనుకూలంగా లేని అధికారులను పక్కనపెట్టేందుకే ఆ విధానం!
మోదీ సర్కారుపై మాజీ ఐఏఎస్ అనిల్ స్వరూప్ సంచలన వ్యాఖ్యలు
అభద్రతలో ప్రధాని నరేంద్రమోదీ
బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి
న్యూఢిల్లీ, మే 31: ప్రధాని నరేంద్రమోదీ తన పదవి పట్ల అభద్రతతో ఉన్నారా? క్యాబినెట్ సహచరులను కూడా నమ్మడంలేదా? అందుకే కేంద్రమంత్రులు మీడియా సమావేశాన్ని నిర్వహించాలంటే కూడా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి అనుమతి తీసుకోవాలని నిబంధన పెట్టారా? మాజీ ఐఏఎస్, కేంద్ర మాజీ కార్యదర్శి అనిల్ స్వరూప్ తన తాజా పుస్తకం ‘నో మోర్ ఏ సివిల్ సర్వెంట్’లో వెలువరించిన విషయాలు సంచలనంగా మారాయి.
అనిల్ స్వరూప్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..
- నేను రెండు ప్రభుత్వాల హయాంలో (యూపీఏ, ఎన్డీయే) పనిచేశా. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలోని పీఎంవోలో అధికార కేంద్రీకరణ జరుగుతున్నట్టు నాకు అనిపిస్తున్నది. ఇది తప్పనిసరి అని నేను అనుకోవట్లే. ప్రతీ విషయానికి పీఎంవో అనుమతి ఎందుకు తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు.
- మంచివో.. చెడ్డవో.. గతంలో క్యాబినెట్ మంత్రులు స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకొనేవారు. అయితే, ఆ పరిస్థితి ఈ ప్రభుత్వ హయాంలో లేదు. మీడియా సమావేశాలు నిర్వహించడానికి కూడా మంత్రులు పీఎంవో అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి.
- నేను విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు సీబీఎస్ఈ ప్రశ్నపత్రం లీక్ అయింది. దీనిపై నేను మీడియా సమావేశం పెట్టాలనుకొన్నా. అయితే, పీఎంవో అనుమతి తీసుకోవాలని మా శాఖ మంత్రి నాకు సూచించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలంటే పీఎంవో అనుమతి ఎందుకు? అని నేను ఆశ్చర్యపోయా.. ఇలాంటి ఉదాహరణలు ఎన్నెన్నో..
- సివిల్ సర్వీస్ అధికారుల పనితీరును అంచనా వేయడానికి 2015లో మోదీ ప్రభుత్వం 360 డిగ్రీల ఎవాల్యుయేషన్ పేరిట ఓ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది మంచి ఆలోచన. అయితే, అమలు మాత్రం పారదర్శకంగా జరుగలేదు. ఎందుకనో 20-25 ఏండ్ల పాటు ఎంతో సమర్థంగా పనిచేసిన అధికారులను కూడా కారణం లేకుండానే ఉన్నపళంగా తొలగించారు. ప్రభుత్వానికి అనుకూలంగా లేని వారిని పక్కనబెట్టడమే దీని ఉద్దేశమా?
- రిటైర్మెంట్ కాగానే ఐఏఎస్‌లు, జడ్జిలు రాజకీయాల్లోకి రావడం చట్టపరంగా తప్పేమీ కాకపోవచ్చు. అయితే, నైతికంగా కరెక్ట్ కాదు. మాజీ సీజేఐ రంజన్ గొగొయ్ రిటైర్ కాగానే రాజ్యసభ సభ్యుడు అయ్యారు. సీజేఐగా ఉన్నప్పుడు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆ కేసు మరుగునపడిపోయింది. ఈ కేసులో ఫిర్యాదుదారు, నిందితులు రాజీపడ్డారా? ఇంతలో ఆయన రిటైర్ అయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు అయ్యారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండగానే రాజకీయాలు చేయడాన్ని నేను స్వాగతించను.
ఎవరీ అనిల్ స్వరూప్?

అనిల్ స్వరూప్ ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2014-16లో బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, 2016-18 విద్యాశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. అంతకుముందు మన్మోహన్సింగ్ యంత్రాంగంలో కూడా పనిచేశారు. 2018లో పదవీవిరమణ చేశారు.
అధికారాలు ఇవ్వరు!

ప్రధాని మోదీ అభద్రతాభావంతో ఉన్నారు. ఆయన విద్యార్హతలు సాధారణమైనవే. అయినప్పటికీ, తన క్యాబినెట్ సహచరులకు అధికారాలను ఇవ్వరు. మద్రాస్ స్టేట్‌కు సీఎంగా పనిచేసిన కామరాజ్ ఒక నిరక్షరాస్యుడు. అయినప్పటికీ, ఎంతో చురుకైన రాజకీయ నాయకులను తన క్యాబినెట్లోకి తీసుకొని ప్రాధాన్యం ఉన్న శాఖలను, అధికారాలను ఇచ్చారు. ఆయనకు అభద్రత ఉండేది కాదు. అందుకే ప్రజలు ఇప్పటికీ ఆయన్ని గుర్తుపెట్టుకొంటున్నారు.
–బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

