Jarkhand : సమస్యలపై యువత కదం తొక్కడంతో జార్ఖండ్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం సర్కార్ దిక్కుతోచని స్ధితిలోకి వెళ్లిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యాయం కోసం పోరుబాట పట్టిన యువతపై లాఠీచార్జితో సోరెన్ సర్కార్ విరుచుకుపడిందని విమర్శించారు.నిరుద్యోగ యువతను నిలువరించి లాఠీచార్జి చేశారని ఆరోపించారు.
హేమంత్ సోరెన్ సర్కార్కు నూకలు చెల్లాయని ఈ ప్రభుత్వం రెండు నెలల్లో దిగిపోతుందని దుయ్యబట్టారు. ఐదు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. దీనిపై బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ఆందోళన చేపడితే జేఎంఎం విధ్వంసానికి తెగబడిందని అన్నారు.
యువతను ఎక్కడికక్కడ అడ్డగించి లాఠీలు ఝళిపించారని, బస్సులను సీజ్ చేశారని, ప్రజాస్వామ్యయుత ఉద్యమాన్ని ఇలా నిలువరిస్తారా అని ఆయన ప్రశ్నించారు. యువత ఆందోళనకు హేమంత్ సోరెన్ భయపడటంతోనే విధ్వంసానికి పూనుకున్నారని ఆరోపించారు. సోరెన్ సర్కార్కు జార్ఖండ్ ప్రజలు త్వరలో చరమగీతం పాడనున్నారని జోస్యం చెప్పారు.
Read More :
Nallagonda | నల్లగొండ జిల్లాలో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ప్రసవించిన మహిళ