Nallagonda | నల్లగొండ జిల్లాలో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ప్రసవించిన మహిళ
Nallagonda | నల్లగొండ(Nallagonda ) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించిన అమానవీయ ఘటన నల్లగొండ జిల్లా ప్రభుత్వ దదవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
నల్లగొండ : నల్లగొండ(Nallagonda ) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించిన అమానవీయ ఘటన నల్లగొండ జిల్లా ప్రభుత్వ దదవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని నేరడుగొమ్మ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి అశ్విని గర్భిణి(Pregnant) గురువారం రాత్రి పురిటినొప్పులతో జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు వెళ్లారు. అక్కడ డాక్టర్లు లేరని.. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది పంపించారు.
దేవరకొండ నుంచి అంబులెన్స్‌లో నల్గొండ జిల్లా దవాఖానకు చేరుకున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారని హాస్పిటల్ సిబ్బంది వారిని ప్రశ్నించారు. మూడో కాన్పు దేవరకొండలో చేయించక ఇక్కడి దాక రావడం ఏంటంటూ అసహనం వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈ క్రమంలో అశ్వినిని బయట కుర్చీలోనే కూర్చోబెట్టారు నర్సులు. నొప్పులు వస్తున్నాయి అని చెప్పినప్పటికి ఎవరు పట్టించుకోలేదు. తీవ్ర నొప్పులతో బాధ పడుతూ అశ్విని కుర్చీలోనే డెలివరీ (Delivery)అయింది. కుర్చీ కింద తీవ్ర రక్త స్రావం కావడంతో అప్పుడు హాస్పిటల్ సిబ్బంది వచ్చి హడావుడి చేస్తూ పేషెంట్ పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ తరువాత లోపలికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణంపై అక్కడే ఉన్న ఇతర రోగుల బంధువులు, ఇతరులు వైద్యులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికి రాకూడదని, నిర్లక్ష్యం చేసిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి భర్త ఆంజనేయులు డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్, నర్సులపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణ చందర్ హుటాహుటిగా హాస్పిటల్‌కు తరలి వచ్చారు. ఘటనపై వివరాలు సేకరించారు. బాధ్యులపై చర్యల కోసం నివేదికను ఉన్నతధికారులకు అందజేస్థానని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

