తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateswara Swami Temple) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) దర్శించుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి తోమల సేవలో (Thomala Seva) పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గడ్కరీ దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జ్ఞాపికలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రజాసేవ చేసే శక్తిని తనకు ప్రసాదించాలని కోరుకున్నానని తెలిపారు.
తిరుపతిలోని (Tirupati) ఎస్వీ యూనివర్సిటీ (SV University)స్టేడియంలో జరుగనున్న సభలో మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ రహదారులను జాతికి అంకితం ఇస్తారు.
#WATCH | Andhra Pradesh | Union Minister Nitin Gadkari, along with his family, took part in 'Thomala Seva' and offered prayers to Lord Venkateswara at Sri Venkateswara Swami Temple in Tirumala earlier this morning. pic.twitter.com/pVqWMi6gnX
— ANI (@ANI) July 13, 2023