నాగ్‌పూర్: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి ఓ ఆగంతకుడు ఫోన్ చేసి ఆయనను చంపుతానంటూ బెదిరించాడు. అంతర్జాతీయ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిగా పేర్కొన్న ఆ వ్యక్తి తనకు రూ.వంద కోట్లు ఇవ్వకపోతే ఆయన కార్యాలయాన్ని కూడా పేల్చివేస్తానని హెచ్చరించాడు. నాగ్‌పూర్ ఖమ్లాలో ఉన్న గడ్కరీ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ ఫోన్‌కు శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయని సీపీ అమితేశ్ కుమార్ తెలిపారు. గడ్కరీ కార్యాలయానికి, ఆయన నివాసానికి మధ్య కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. బెదిరింపు కాల్స్‌తో అప్రమత్తమై ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని సీపీ వెల్లడించారు.