నాగ్‌పూర్: పాన్ మసాలా నమిలి రోడ్లపై ఉమ్మివేసే వారి ఫొటోలు తీసి పేపర్లో ప్రచురించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. బుధవారం నాగ్‌పూర్‌లో నిర్వహించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘ప్రజలు చాలా స్మార్ట్. చాక్లెట్ తిన్న తర్వాత కవర్‌ను వెంటనే పారేస్తారు. అదే వారు విదేశాలను సందర్శించినప్పుడు మాత్రం, చాక్లెట్ తిన్నాక కవర్‌ను జేబులో పెట్టుకుంటారు. విదేశాల్లో చక్కగా ప్రవర్తిస్తారు’ అని పేర్కొన్నారు.