బెంగళూరు: కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన ముక్కు నుంచి రక్తం కారడంతో హుటాహుటిన దవాఖానకు తరలించారు. బెంగళూరులో బీజేపీ-జేడీఎస్ నిర్వహించే పాదయాత్ర గురించి ఆయన చెప్తున్నపుడు ఆయన చొక్కా రక్తంతో తడిసిపోవడం కనిపించింది. అంతకుముందు బీజేపీ, జేడీఎస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కర్ణాటకను పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బెంగళూరు నుంచి మైసూరు వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. వచ్చే నెల 3 నుంచి 10 వరకు జరిగే ఈ యాత్రలో కాంగ్రెస్ కుంభకోణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.