N. Jaishankar | తిరువనంతపురం, ఏప్రిల్ 5: భారతదేశ ఎన్నికలపై ఇటీవల ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి జై శంకర్ తిప్పికొట్టారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని మీరు మాకు చెప్పాల్సిన పనిలేదని జవాబిచ్చారు. భారత్లో రాజకీయ, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని తాము ఆశిస్తున్నట్టు యూఎన్వో ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జై శంకర్ పై విధంగా స్పందించారు.
తిరువనంతపురంలో బీజేపీ తరుఫున పోటీ చేస్తున్న తన మంత్రివర్గ సహచరుడు రాజీవ్ చంద్రశేఖర్ కోసం జైశంకర్ ప్రచారం చేయటానికి గురువారం అక్కడికి వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మన దేశ ఎన్నికలపై సరైన సమాచారం లేకుండా, అపోహలు, అసత్యాలతో యూఎన్వో ప్రతినిధి మాట్లాడారని పేర్కొన్నారు.