Kumaraswamy : రాష్ట్రంలో మరోసారి కులసర్వే (Caste survey) నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ నెల 22 నుంచి సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలంగా ఉన్న ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు (Vokkaliga leaders) ఇవాళ సమావేశమయ్యారు. రెండు రోజుల్లో మొదలుకానున్న కులసర్వేపై చర్చించారు.
ఈ సమావేశానికి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర మంత్రి కుమారస్వామి, బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం బయటకు వెళ్తున్న కేంద్ర మంత్రి కుమారస్వామిని మీడియా ప్రశ్నించగా.. సంచలన కామెంట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కులసర్వే సాధ్యం కాదని అన్నారు. కులసర్వే అనేది ఒక పిల్లకాలి నిర్ణయమని ఎద్దేవా చేశారు.