చీఫ్ గెస్ట్‌గా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను వద్దన్నారు..

న్యూఢిల్లీ: సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) 58వ రైజింగ్ పరేడ్ సందర్భంగా ఇవాళ జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తేనిని ముఖ్య అతిథి జాబితా నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మరో సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ హాజరయ్యారు. ఢిల్లీలో జరిగిన పరేడ్‌లో ప్రామాణిక్ చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. చివరి నిమిషంలో మంత్రి అజయ్ మిశ్రాను ముఖ్య అతిథి లిస్టు నుంచి తొలగించారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 3వ తేదీన జరిగిన ఘటనలో 4 మంది రైతులు మరణించారు. మంత్రి అజయ్ మిశ్రా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని ఇప్పటికే విపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే రైజింగ్ డే పరేడ్‌లో చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాల్సిన మిశ్రాను చివరి నిమిషంలో తప్పించినట్లు తెలుస్తోంది. గడిచిన వారం నార్త్ బ్లాక్‌లో ఆఫీసుకు వచ్చిన మిశ్రాను ఎందుకు చీఫ్ గెస్ట్ లిస్టు నుంచి తొలగించారో తెలియదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

