న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రతిపక్ష ఇండియా కూటమితో అసలైన సవాల్ ఎదురుకానున్నదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. అయితే బీజేపీ ఏ ఎన్నికను తేలిగ్గా తీసుకోదని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. సొంత రాష్ట్రం ఒడిశా నుంచి పోటీ చేయాలనుందని ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. న్యూఢిల్లీలో శుక్రవారం కేంద్ర మంత్రి మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని పార్టీని అభ్యర్థించినట్టు తెలిపారు.