న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. శనివారం ఆయన ప్రయాణిస్తున్న కారును భారీ ట్రక్ ఒకటి ఢీకొంది. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై రిజిజు కారులో ప్రయాణిస్తుండగా ట్రక్ ఢీకొందని, అదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలూ కాలేదని వార్తలు వెలువడ్డాయి.