అహ్మదాబాద్, ఏప్రిల్ 20: గుజరాత్లోని గాంధీనగర్లో ఎంపీగా పోటీ చేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా నామినేషన్ సందర్భంగా, తన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించారు.
రూ.36 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయని, అయితే సొంతంగా కారు లేదని శుక్రవారం అఫిడవిట్లో వెల్లడించారు. తన వద్ద 72 లక్షలు, తన భార్య వద్ద 1.06 కోట్ల విలువైన నగలు ఉన్నట్టు తెలిపారు.