Union Govt on Omicron | కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో పెరిగిపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ కట్టడికి జిల్లా, క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ.. మంగళవారం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాశారు.
కఠినమైన కంటైన్మెంట్ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్‌కు మూడు రెట్లు వ్యాపించగల సామర్థ్యం ఉంటుందని పేర్కొన్నారు. దూరదృష్టితో వ్యవహరిస్తూ.. ఎప్పటికప్పుడు తగిన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు.