Union Budget | యువత ఆకాంక్షలకు అద్దంపట్టేలా బడ్జెట్‌ను రూపొందించాం : నిర్మలా సీతారామన్
Union Budget | కేంద్ర ఆర్థికమంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) లోక్‌సభ (Lok Sabha) లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏకంగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో మూడు కొత్త విద్యా సంస్థలను స్థాపించినట్లు తెలిపారు.
Union Budget | కేంద్ర ఆర్థికమంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) లోక్‌సభ (Lok Sabha) లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏకంగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో మూడు కొత్త విద్యా సంస్థలను స్థాపించినట్లు తెలిపారు. సంస్కరణలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 7 శాతం వృద్ధితో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
పవిత్ర మాఘపూర్ణిమ రోజున బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని, ప్రపంచ మార్కెట్లతో భారత్‌ను అనుసంధానిస్తున్నామని నిర్మలాసీతారామన్ అన్నారు. ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకున్నట్లు తెలిపారు. వికసిత భారత్‌లో భాగంగా యువత ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు. పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
ఇది కర్తవ్యభవన్‌లో రూపొందించిన మూడో బడ్జెట్ అని ఆర్థిక మంత్రి చెప్పారు. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామని అన్నారు. అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండేలా చూస్తామన్నారు. 2025 ఆగస్టు తర్వాత 350 సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆర్థిక ప్రణాళికలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉందన్నారు.
అదేవిధంగా జీఎస్టీ, లేబర్‌కోడ్ తదితర రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈ (MSME) ల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. రూ.10 వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకం తీసుకొస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

