న్యూఢిల్లీ, జూలై 16 : ‘ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన’ పథకానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి ఏటా 24 వేల కోట్ల వ్యయంతో 100 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయనున్నారు.
పథకాన్ని ఈ ఏడాది అక్టోబర్లో ప్రారంభించబోతున్నట్టు కేంద్రం తెలిపింది. అలాగే పునరుత్పాదక ఇంధనం కోసం ఎన్టీపీసీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎల్సీఐఎల్ చేపట్టే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో రూ.7 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి కూడాక్యాబినెట్ అనుమతించింది.