న్యూఢిల్లీ : సూక్ష్మ, చిన్న-మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా కేంద్ర సర్కార్ వీటి రుణ పరిమితిని రెట్టింపు చేసింది. ఎంఎస్ఎంఈల టర్నోవర్‌ను కూడా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు సవరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోటికి పైగా చిన్న సంస్థలు ఉన్నాయని, వీటిద్వారా 7.5 కోట్ల మందికి ఉపాధి దొరుకుతున్నది.
రూ.100 కోట్ల టర్నోవర్ సంస్థను చిన్న కంపెనీగా గుర్తించనున్నారు. ద్రవ్యోలోటును 4.8 శాతానికి కట్టడి చేయాలనుకున్న కేంద్రం.. వచ్చే ఏడాది 4.4 శాతానికి దించాలని ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలు, రిజర్వుబ్యాంక్ నుంచి రూ.2.56 లక్షల కోట్లు డివిడెండ్ల రూపంలో రావచ్చునని అంచనావేస్తున్నది. ప్రస్తుతేడాది రూ.2.34 లక్షల కోట్లు సమకూరాయి. గతంలో అంచనావేసినదానికంటే ఇది రూ.1,410 కోట్లు అధికం.