Union Budget 2025 Live Updates | 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను (Union Budget) ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్‌సభలో బడ్జెట్‌ను చదవి వినిపిస్తున్నారు. 2019లో ఆమె బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తాత్కాలిక బడ్జెట్లతో కలిపి వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ను (వరుసగా 6 సార్లు) అధిగమించారు. ఇవాళ ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దీంతో ఆమె మరో మైలురాయిని అందుకున్నారు. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సమం చేశారు. ఇప్పటివరకు అత్యధికంగా 10 సార్లు మొరార్జీ దేశాయ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, పీ. చిదంబరం 9 సార్లు బడ్జెట్ సమర్పించారు.
ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
గంటా 15 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం
అసెంబ్లీ ఎన్నికల కారణంతో బీహార్‌పై వరాల జల్లు
కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు
రూ. 0-4 లక్షలు - సున్నా
రూ. 4-8 లక్షలు - 5 శాతం
రూ. 8-12 లక్షలు - 10 శాతం
రూ. 12-16 లక్షలు - 15 శాతం
రూ. 16-20 లక్షలు - 20 శాతం
రూ. 20-24 లక్షలు - 25 శాతం
రూ. 24 లక్షల పైన 30 శాతం
రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు
ఈ విషయం చెప్పేందుకు సంతోషిస్తున్నాను.. నిర్మలా సీతారామన్
మధ్య తరగతి ఉద్యోగులకు డబ్బు పొదుపు చేసుకునేందుకు వీలు ఉంటుంది..
స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ. 12.75 లక్షల వరకు పన్ను సున్నా..
రూ. 12 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రూపంలో రూ. 70 వేలు ఆదా
రూ. 25 లక్షల ఆదాయం ఉన్న వారికి రూ. లక్షా పది వేలు ఆదా
2024-25 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వ్యయం రూ. 47.16 లక్షల కోట్లు
మూలధన వ్యయం రూ. 10.1 లక్షల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ అంచనా రూ. 31.47 లక్షల కోట్లు(అప్పులు మినహా)
నికర పన్నుల ద్వారా సమకూరిన ఆదాయం రూ. 25.57 లక్షల కోట్లు
ద్రవ్యలోటు జీడీపీలో 4.8 శాతంగా ఉంటుందని అంచనా
వచ్చే ఆర్థిక సంవత్సరానికి నికర అప్పులు రూ. 11.54 లక్షల కోట్లు ఉంటుందని అంచనా
2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు అంచనా 4.4 శాతం
సీనియర్ సిటిజన్స్‌కు టీడీఎస్ మినహాయింపు రూ. 50 వేల నుంచి రూ. లక్షలకు పెంపు
అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంపు
అప్డేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ నమోదుకు సమయం 4 ఏండ్లకు పొడిగింపు
కొత్త పన్ను బిల్లును ప్రారంభించడం, న్యాయాన్ని కొనసాగించడం కోసం, పన్నుల చట్టాన్ని తీసుకువస్తున్నాం
ఇది చాలా సరళంగా ఉంటుంది..
ఎటువంటి లిటిగేషన్ లేకుండా సరళ చేశాం
సుపరిపాలన కోసం, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం..
ఒక దేశాన్ని నిర్మించే ఉద్దేశంలో ఈ ప్రయత్నం కోసం కృషి చేస్తున్నాం
ప్రధాని నాయకత్వంలో ఈ దేశం అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి
దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం..
వ్యక్తిగత ఆదాయపు పన్నుల విషయంలో మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకున్నాం..
టీడీఎస్‌ను హేతుబద్దీకరించాం
పన్నులను తగ్గుదల చేయడం జరిగింది..
విద్యుత్ సంస్కరణలకు కీలకంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం
వర్థమాన ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహం
6 లైఫ్ సేవింగ్ మెడిసిన్సపై పన్నులు తగ్గింపు
33 ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి
ప్రీమియం మొత్తాన్ని దేశంలోనే పెట్టుబడి పెట్టి విదేశీ సంస్థలకు అనుమతి
రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
ఐఐటీ, ఐఐఎస్సీల్లో పరిశోధనలు చేసే 10 వేల మందికి ఫెలోషిప్స్
వచ్చే వారం పార్లమెంట్ ముందుకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు
ఇన్కమ్ ట్యాక్స్‌లో ఉన్న అనవసర సెక్షన్లు తొలగింపు
క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం
పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్
రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు
7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
రూ. 25 వేల కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు
ప్రభుత్వం, ప్రయివేటు, పోర్టుల భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్
వృద్ధి కేంద్రాలుగా పట్టణాల అభివృద్ధికి రూ. లక్ష కోట్లతో ప్రత్యేక మిషన్
27 రంగాల్లో స్టార్టప్‌లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ
120 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తాం..
వచ్చే పదేండ్లలో 4 కోట్ల మంది కొత్త ప్రయాణికులకు సౌకర్యం
బీహార్‌లో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్
రూ. 30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు
సంస్కరణలకు ప్రోత్సాహంగా రాష్ట్రాలకు 5 ఏళ్ల వ్యవధితో వడ్డీ లేని రుణాలు
క్యాన్సర్ కేంద్రాలను ప్రతి జిల్లాలో ప్రారంభిస్తాం
200 డే కేర్ కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించాం
2019 నుంచి 15 వేల కోట్ల గృహాలకు 80 శాతం మందికి సురక్షిత జలాలు అందాయి..
మంచినీటి కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత నీరు ఇచ్చాం
2028 నాటికి అన్ని గృహాలకు ఇచ్చేలా పథకం రూపొందించాం..
పీపీపీ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తాం
ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి 1.5 లక్షల కోట్లను ప్రతిపాదించాం
వడ్డీలు లేకుండా రుణాలు ఇస్తాం
ఆస్తులను పర్యవేక్షించే విధానం తీసుకువచ్చాం..
సుస్థిరమైన జీవన విధానం కోసం పీఎం స్వయం నిధి తీసుకువచ్చాం
65 వేల లక్షల మంది లబ్ది చేకూరింది..
వీధి వ్యాపారులకు రుణాలు ఇస్తాం
పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు
ఐఐటీ పాట్నాను ఆధునీకరించాం..
అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు..
బడ్జెట్ వేళ పద్మశ్రీ అవార్డు గ్రహీత గిఫ్ట్‌గా ఇచ్చిన శారీలో నిర్మలమ్మ.. ప్రత్యేకతేంటో తెలుసా..? .... Read more
50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను వచ్చే ఐదేండ్లలో ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేస్తాం
విద్యార్థుల్లో సాంకేతికతను పెంపొందిస్తాం
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బ్రాండ్ బాండ్ కనెక్టివిటీ తీసుకువస్తాం
భారతీయ భాషల్లోని పుస్తకాలను డిజిటల్ తీసుకువస్తాం..
సులభంగా బోధన చేసే పద్ధతులను తీసుకువస్తాం..
నిర్వహణ కోసం బీహార్‌లో సంస్థను స్థాపిస్తాం
ఆహార శుద్ధికరణ తూర్పు ప్రాంతమంతా విస్తరిస్తాం
రైతులకు మరింత ఆదాయం తీసుకురావడంతో పాటు వారి ఉత్పత్తులకు విలువ ఇస్తాం
దీని వల్ల ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి
ఒక పథకాన్ని తీసుకువస్తాం..
ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల తయారీ దేశంగా తయారు చేస్తాం
కొన్ని ప్రాంతాలను గుర్తించి నైపుణ్యం గల బొమ్మల తయారీ పెంపొందిస్తాం
యంత్రాలు, తోళ్ల రహిత చెప్పుల తయారీకి చర్యలు
దీని వల్ల 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
ఒక కోటి కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు నమోదు అయి ఉన్నాయి..
ఉద్యోగ కల్పన బాగా ఉంది
నాణ్యమైన ఉత్పత్తులతో పాటు 45 శాతం ఎగుమతులు ఉన్నాయి..
సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిస్తున్నాం..
మూలధనం పెంచబోతున్నాం
2.5 రెట్లు అధికంగా కేటాయింపులు చేస్తున్నాం
ఎంఎస్ఎంఈల వృద్ధికి ప్రయత్నిస్తున్నాం..
సూక్ష్మ పరిశ్రమలు 1.5 లక్షల కోట్ల వరకు రాబోయే ఐదేండ్లలో రుణాలు ఇస్తాం..
పత్తిలో ఎక్కువ రకాలు తీసుకువస్తాం
సాంకేతికత తీసుకువస్తున్నాం.. ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం
సంప్రదాయక వస్త్ర ఉత్పత్తిని పెంపొందిస్తాం..
సముద్ర ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం..
సుస్థిరమైన మత్స్య పద్ధతులను తీసుకువస్తాం
దీవులపై కూడా దృష్టి సారిస్తాం
రాబోయే నాలుగేండ్లలో పప్పు ధాన్యాలను ప్రత్యక్షంగా సేకరిస్తాం..
కూరగాయాలు, పండ్ల కోసం కొత్త కార్యక్రమాలు తీసుకువస్తాం
సమాజంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు..
కూరగాయాలు, పండ్ల వీటి వినియోగం పెరుగతుంది..
రైతులకు మరిన్ని లాభదాయక ధరలు పెంచేలా చేస్తాం..
ప్రస్తుతం పథకాలతో అధునాతన వ్యవసాయ పద్ధతులను తీసుకొస్తున్నాం..
పంటల్ని స్టోరేజ్ చేసేందుకు సదుపాయాలు కల్పిస్తాం.
దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యవస్థ వల్ల రైతులకు లబ్ది
గ్రామీణ ప్రాంతాల్లో సంపదను సృష్టించడం కోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తాం
నైపుణ్యాన్ని, టెక్నాలజీని పెంపొందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తున్నాం
చిన్న, సన్నకారు రైతులను వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం
సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తాం.
ఫేజ్ -1 కింద 100 గ్రామాలను తీసుకుంటాం..
మహిళల పట్ల దృష్టి సారించాం..
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధించడం కోసం అందరిని కలుపుకుపోతున్నాం..
ఇంధన సరఫరాను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం..
వ్యవసాయం, పెట్టుబడులపై ప్రధానంగా దృష్టి సారించాం
వికసిత భారత్‌లో సమ్మిళిత వృద్ధి ప్రధానం..