న్యూఢిల్లీ, జూలై 23: కేంద్ర బడ్జెట్లో హోంశాఖకు రూ.2,19,643 కోట్లు కేటాయించారు. ఇందులో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ లాంటి కేంద్ర పోలీస్ బలగాలకు దాదాపు రూ.1,43,276 కోట్లు ఇవ్వనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన 2024-25 తాత్కాలిక బడ్జెట్లో హోంశాఖకు దాదాపు రూ.2,02,869 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
ప్రస్తుత పూర్తిస్థాయి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జమ్ముకశ్మీర్‌కు రూ.42,277 కోట్లు, లఢక్‌కు రూ.5,958 కోట్లు, అండమాన్, నికోబార్ దీవులకు రూ.5,986 కోట్లు, చండీగఢ్‌కు రూ.5,958 కోట్లు, దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూకి రూ.2,649 కోట్లు, లక్షద్వీప్‌కు రూ.1,490 కోట్లు కేటాయించారు.
