న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు(Uniform Civil Code Bill)ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పంపనున్నారు. ఉమ్మడి పౌరస్మృతిపై ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ అంశానికి ప్రాముఖ్యత సంతరించుకున్నది. స్టాండింగ్ కమిటీకి బిల్లును పంపిన సమయంలో అక్కడ లా ప్యానల్, లీగల్ అఫైర్స్ టీమ్ ప్రతినిధులు అభిప్రాయాలు విననున్నారు. జూలై మూడవ వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలను ఈసారి కొత్త బిల్డింగ్‌ను నిర్వహించనున్నారు. అయితే యూసీసీపై ఇప్పటికే విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్, డీఎంకే పార్టీలు యూసీసీని వ్యతిరేకించాయి.